అల్లు అర్జున్ సందీప్ వంగ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

Spread the love

అర్జున్ రెడ్డి తో ట్రెండ్ సెట్టర్ గా నిలిచి ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమా తీస్తున్న సందీప్ రెడ్డి వంగ తో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్మెంట్ టాలీవుడ్ వర్గాల్లో ఒక సంచలనానికి కారణం అయిందని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే, పుష్ప తో పాన్ ఇండియా సూపర్ స్టార్డం సంపాదించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏ లెవెల్ లో ఉంటుంది అని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పుష్ప 2 రైట్స్ కోసం 1000 కోట్ల పైగా అడుగుతున్నారు అన్న వార్త నుండి తేరుకునేలోగా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో టీ సిరీస్ నిర్మాణం లో అన్న వార్త నెక్స్ట్ సినిమా రేంజ్ గురించి ఒక ఐడియా ఇచ్చింది. కాకపోతే, ఇప్పుడు అందరికి నోట్లో నానుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని.

అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో ఇప్పుడు బిజీ గా ఉన్నారు. ఈ సినిమా ను 2023 డిసెంబర్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు అనిమల్ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా ను 11 ఆగష్టు 2023 న రిలీజ్ చేస్తున్నామని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రభాస్- సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ ఎప్పుడో వచ్చింది. ఆ లెక్క ప్రకారం, ఆగష్టు తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా పై సందీప్ పని చేస్తాడు. ఆ సినిమా తయారు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది. అది కూడా ప్రభాస్ డేట్స్ పై ఆధారపడి ఉంది. అంటే, సందీప్ వంగ 2024 చివరికి కానీ ఫ్రీ కాకపోవచ్చు.

ఈ లెక్క చూస్తే అల్లు అర్జున్- సందీప్ రెడ్డి వంగ సినిమా 2024 చివర్లో కానీ, 2025 లో కానీ ప్రారంభం అవ్వాలి. ఒక వేళ ప్రభాస్ సినిమా లేట్ అవడం జరిగితే అల్లు అర్జున్ సినిమా ముందుకు రావచ్చు కానీ, ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K షూట్ ఇప్పటికే 70 % ముగిసింది. సంక్రాంతి 2024 డేట్ కూడా వచ్చేసింది. మారుతి సినిమా అంత టైం పట్టకపోవచ్చు. దీన్ని బట్టి చూస్తే, ప్రభాస్ 2023 రెండో భాగం లో ఫ్రీ అయి స్పిరిట్ షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర పుష్ప 2 విడుదల తర్వాత కనీసం ఒక్క సంవత్సరం ఫ్రీ టైం ఉంటుంది. మరి ఈ సమయం లో అల్లు అర్జున్ మరో సినిమా చేస్తాడా అన్నదే ప్రశ్న. ఇప్పటికే త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో అని అనౌన్స్ చేసినందున, ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తాడని ఒక వార్త ఫిలిం నగర్ లో వ్యాపిస్తోంది.

మరి, ఏమి జరుగుతుందో మనకు ముందు ముందు తెలుస్తుంది. అప్పటిదాకా మనం చెయ్యగలిగింది కేవలం ఎదురుచూడటమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*