మళ్ళీ హేరా ఫేరీ

Spread the love

ప్రేక్షకులను నవ్వులతో అలరించిన హేరా ఫేరీ తారాగణం అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి మరియు పరేష్ రావల్ హేరా ఫేరీ యొక్క మూడవ భాగం తో తిరిగి ప్రేక్షలు వద్దకు వస్తున్నారు. వారు రాజు, శ్యామ్ మరియు బాబూరావు పాత్రలను తిరిగి పోషిస్తున్న ఈ చిత్రం సెట్స్ నుండి ఈ ముగ్గురి లీక్ అయిన ఫోటో వైరల్ అయ్యింది. ఈ చిత్రంలో వారు తమ ఐకానిక్ కాస్ట్యూమ్స్‌లో కనిపించారు.

“హేరా ఫేరి 4 షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి మరియు పరేష్ రావల్ ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసే ఒక ప్రోమో కోసం షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది. అలాగే ఈ చిత్రం టైటిల్ హేరా ఫేరీ 3 అని కాకుండా హేరా ఫేరీ 4 అని పెడుతున్నారు. అలా ఎందుకు పెడుతున్నారో, సినిమా చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది ” అని ఒక యూనిట్ సభ్యుడు బాలీవుడ్ న్యూస్ పోర్టల్ బాలీవుడ్ హుంగామ కు తెలిపాడు.

2000 వ సంవత్సరం లో ప్రియదర్శన్ దర్శకత్వంలో విడుదలైన హేరా ఫేరీ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. 2006 లో నీరజ్ వోరా దర్శకత్వం వహించిన ఫిర్ హేరా ఫేరీ కూడా విజయవంతం అయింది. మరి ఈ హేరా ఫేరీ 4 తో ఈ ఫ్రాంచైసీ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*